నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్‌కు గూఢచార్యం చేస్తుందనే ఆరోపణ నేపథ్యంలో …. ఇటీవలే అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే హర్యానా హిసారా కోర్టు ఆమెకు నాలుగు రోజులపాటు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. పూరి జగన్నాథ్ టెంపుల్, కోణార్క్ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఆమె సోషల్ మీడియా ఇన్‌స్ట్రా ఖాతాను పరిశీలించనప్పుడు తెలిసిందన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన వీడియోలను పాక్ అధికారులకు షేర్ చేసినట్లు పక్క ఆధారాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.జ్యోతికి చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వీసా ఏజెంట్ హర్కిరత్ సింగ్‌కు చెందిన రెండు మొబైల్ ఫోన్లలో డేటా రిట్రైవ్ చేసేందుకు లాబ్‌కు పంపామని ఎస్పీ వివరించారు.విచారణలో మరిన్ని విషయాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు.
జ్యోతి మల్హోత్రాకు నాలుగురోజులు రిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES