Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సామాజిక విద్య విప్లవకారుడు, మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  కోనా సముందర్ గ్రామంలో హిందూ ధర్మ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే  200 జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నాగపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు బెజ్జరాపు రాకేష్, కంపదండి అశోక్ మాట్లాడుతూ ఫూలే వేసిన ప్రతి అడుగు తొలి అడుగే, ఫూలే ప్రతి కదలికా ఒక సామాజిక విప్లవమే అన్నారు.

ఆధునిక భారత తొలి సామాజిక విప్లవకారుడు, శూద్ర, అత-శూద్ర వర్గాలను బ్రహ్మణ, బనియా దోపిడి నుంచి విముక్తి చేసి, శూద్ర, అతి-శూద్ర వర్గాలను జ్ఞానంవైపు నడిపించిన మార్గదర్శకుడని కొనియాడారు. బహుజనుల విద్య, ఉద్యోగాల, రిజర్వేషన్ల కోసం అంటారానితనం నిర్ములనకోసం పోరాడినా యోధుడన్నారు.సత్యం-జ్ఞానాన్వేషణకు అరని వెలుగులా అఖండ జ్యోతై, మహత్ము డై బాబాసాహేబ్ అంబేడ్కర్ పోరాటలకు స్ఫూర్తి నింపి, జ్యోతిలా వెలుగు మార్గం చూపాడన్నారు. స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడన్నారు.

  కార్యక్రమంలో కోన సముందర్ లో  హిందూ సంరక్షణ సమితి అధ్యక్షులు మేళ్ల చిన్న గంగాధర్, ప్రధాన కార్యదర్శి జనబోయిన దేవేందర్,  పోతుగంటి శ్రీనివాస్, ముల్లె శోభన్, బిజిలి నరేష్, పోతుగంటి భాస్కర్, నాగపూర్ లో ఉప సర్పంచ్ ఉల్లెంగుల  శశిధర్, కార్యదర్శి సంధ్య, వార్డు సభ్యులు సుజాత, అంగన్వాడి భూలక్ష్మి, ఏఎన్ఎంలు సహన అరుణ, ఆశ వర్కర్లు పద్మ, శారద, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -