– సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేశారు : మాజీ ఎంపీ వి.హనుమంతారావు
– అంబర్పేట అలికే చౌరస్తాలో ఫూలే జయంతి వేడుకలు
నవతెలంగాణ-అంబర్పేట
మహానీయుడు, సామాజిక సంస్కర్త, విద్యా విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మాజీ ఎంపీ వి హనుమంతారావు అన్నారు. జ్యోతిరావు ఫూలే 199వ జయంతి వేడకల్ని అంబర్పేట అలికే చౌరస్తాలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్కూల్ పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హనుమంతారావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కషి చేసిన మహనీయుడనీ కొనయాడారు. అనాటి కాలంలో సమాజంలో ఉన్న అసమానతలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యా యాలను తొలగించేందుకు ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో యిందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్. బొలు కిషన్. పీసీసీ కార్యదర్శులు లక్పతి యాదగిరి గౌడ్. శంభుల శ్రీకాంత్ గౌడ్. మాజీ కార్పొరేటర్లు పుల్ల నారాయణ స్వామి. పులి జగన్, గరిగంటి రమేష్, దిండి రాంబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్తిబాబు, రామ్మోహన్, ఈడెల్లి ప్రభాకర్, షేక్ జమీర్, గడ్డం శ్రీధర్ గౌడ, పంజాల వెంకటేష్, కోటం అనిల్, రావుల సుధాకర్, సి సుధాకర్, మహేష్ గౌడ్, మెట్టు ధనరాజ్, ఖాదర షరీఫ, ఠాగూర్ హరి తిలక్ సింగ్, జహంగీర్ భారు, ఫరీద్ భారు, రవి, శ్రీనివాస్ రెడ్డి, సందీప్ గౌడ్, కోట్ల కిరణ్, హలీం భారు, సమత్ భారు, భగవాన్, రాఘవ, లక్ష్మణ్, శ్రీకాంత్, సునీల్ గౌడ్, భాను యాదవ్, కాంగ్రెస్ మహిళా నాయకులు విజితా రెడ్డి, శాంతమ్మ, యూత్ కాంగ్రెస్ నాయకులు సలీముల్లా, తదితరులు పాల్గొన్నారు.
విద్యా విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



