Monday, April 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅక్షరసూర్యుడు జ్యోతిరావు ఫూలే

అక్షరసూర్యుడు జ్యోతిరావు ఫూలే

- Advertisement -

కుల విద్వేషాలను కండ్లకు కట్టిన ఫూలే నాటకం
ఆద్యంతం ఆలోచింపచేసిన ఘట్టాలు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మనువాద కోరల్ని బద్దలుకొట్టిన సామాజికవేత్త జ్యోతిరావు ఫూలేపై ప్రదర్శించిన నాటకం ఆనాటి కుల విద్వేషాలను కండ్లకు కట్టింది. కులనిర్మూలన సాంస్కృతికోత్సవాల్లో భాగంగా సింధూర కల్చరల్‌ అసోసియేషన్‌ ఒంగోలు వారితో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ప్రదర్శించిన ఫూలే నాటకం వీక్షకులను ఆలోచింప జేసింది. అఖండ భారతంలో 2500 ఏండ్లుగా, బుద్ధుని తర్వాత అలుముకున్న అజ్ఞానపు చీకట్లను ఛేదించిన అక్షర సూర్యుల ప్రస్థానాన్ని ప్రదర్శించారు. ఆనాడు మరాఠా గడ్డపై నిరంకుశ పేశ్వాల పాలనలో నీరు కూడా తాగలేని దళితుల హక్కుల కోసం, బానిసలకే బానిసలుగా బతుకుతున్న-స్త్రీ జాతి కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడైన ఫూలే గొప్పతనాన్ని నాటకంలో చూపించారు. ‘ఆనాడు చదువు కోవడమే నేరంగా చంపబడ్డ ఓ దళిత బాలుడు, తన బ్రాహ్మణ మిత్రుడి పెండ్లికి వెళితే గెంటేయడం లాంటి ఘటనలు ఫూలే ను ఆలోచింపజేశాయి.

బ్రాహ్మణ సమాజం ఏది చెబితే అదే నిజమని నమ్మే అణగారిన వర్గాలను మార్చాలనీ, అందుకు చదువే మార్గమని ఫూలే నిర్ణయించారు. అందుకు తన భార్య సావిత్రిబాయి ఫూలేకు ముందుగా చదువు నేర్పించి ఆమెను దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. మహిళలకు, అణగారిన వర్గాలకు విద్యను అందించడం కోసం 1848లో పూణేలో పాఠశాలను స్థాపించారు. కులవివక్షకు వ్యతిరేకంగా, నిమ్న వర్గాల హక్కుల కోసం 1873 సెప్టెంబర్‌ 24న సత్యశోధక్‌ సమాజ్‌ను స్థాపించారు. వితంతువుల కోసం ప్రత్యేక గృహాలను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కార్యక్రమా లను చేపట్టడం’లాంటి వాస్తవ ఘటనలను నాటకంలో ఆవిష్క రించారు. నాటకాన్ని డి.విజరుకుమార్‌ రచించగా, పాటిబండ్ల ఆనందరావు దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్‌. వినరుకుమార్‌ తెలంగాణ ప్రజా సంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే) రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -