నవతెలంగాణ -పెద్దవంగర
సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ నివాళులర్పించి, మాట్లాడారు. సమ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారన్నారు. స్త్రీ, పురుష సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం ఆదర్శం, స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనపురం వినోద్, వార్డు సభ్యులు సురేష్ బాబు, రవి, రమ నారాయణ, గ్రామస్తులు నారాయణ రెడ్డి, బిక్షం, మోహన్ రెడ్డి, యాకన్న, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



