Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జ్యోతిరావు పూలే కృషి మరువలేనిది

జ్యోతిరావు పూలే కృషి మరువలేనిది

- Advertisement -

అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు దేవయ్య 
నవతెలంగాణ – మిడ్జిల్ 

సమాజంలో కులపరమైన వివేక్షను, అన్యాయాలను, రూపుమాపడానికి తన జీవితాన్నే ధార పోసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు దేవయ్య, కళాశాల ప్రిన్సిపాల్  తిరుపతయ్యలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనాల్లో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అజ్ఞానం అనే చీకట్లో మగ్గుతున్న అనగారిన వర్గాల  మహిళలకు చదువు నేర్పించిన మహోన్నత జ్యోతిరావు పూలే అని కొనియాడారు. దేశంలో సమాజం కుల వ్యవస్థ, లింగ వివక్షతో బంధించబడిన సమయంలో ఆయన ధైర్యంగా సంఖ్యలను ఛేదించడానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. భారతదేశంలోనే బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించి తన భార్య సావిత్రిబాయిని చదువు నేర్పించి మొదటి మహిళా టీచర్లు చేసిన ఘనత జ్యోతిరావు పూలేకే దక్కిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు బాలయ్య, రాజేశ్వర్ ఎడ్ల శంకర్ ముదిరాజ్, బుచ్చయ్య, జహీర్, రహీం, సురేందర్ గౌడ్, ఖలీల్, కలశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -