Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దర్పల్లి ఎస్ఐగా కె.వినయ్

దర్పల్లి ఎస్ఐగా కె.వినయ్

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
దర్పల్లి ఎస్ఐగా కె.వినయ్ ఆదివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్ఐ సామ శ్రీనివాస్ రెండు రోజుల క్రితం సెలవుపై వెళ్లగా.. జిల్లా కమిషనరేట్ నుండి వినయ్ కు దర్పల్లి ఎస్ఐగా ఉత్తర్వులు జారి చేశారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించడం అనివార్యమైంది. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. మండల ప్రజల సహకారంతో నేరాలను జరగకుండా చూస్తానని, యువత పెడదారి పట్టకుండా, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తగు చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రజలు అసంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా చట్టాలను గౌరవించాలని కోరారు. వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -