Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్టూర్ జెడ్పీ హైస్కూల్ మైదానంలో కబడ్డీ పోటీలు

వెల్టూర్ జెడ్పీ హైస్కూల్ మైదానంలో కబడ్డీ పోటీలు

- Advertisement -

206 మంది విద్యార్థులు ప్రతిభ ప్రదర్శన
నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం వెల్టూర్ జెడ్పీ హైస్కూల్ మైదానంలో శనివారం 35వ సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఈ క్రీడల్లో  మొత్తం పాల్గొన్న వారు: 206 మంది విద్యార్థులు. బాలికలు: 120,బాలురు: 86 పాల్గొన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు జనార్థన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్, ఎస్సై వెంకట్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆటలను ప్రారంభించారు. విద్యార్థుల ప్రతిభ, ఆటతీరు ఆధారంగా ఎంపిక ప్రక్రియను అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, కోచ్‌లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ రంగారెడ్డి, లింగమయ్య, శ్రీనివాసులు, నాయకులు బాల్ రెడ్డి, మల్లయ్య, ఉప్పరి బాలరాజు, గుద్ధటి బాలరాజు, సమ్మదు, శాఖిల్, నాగరాజు, సయ్యద్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -