Tuesday, March 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకడియం శ్రీహరి విచారణ వాయిదా.!

కడియం శ్రీహరి విచారణ వాయిదా.!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పార్టీ ఫిరాయంపు కేసులో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనపై పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా విచారణకు హాజరై తన వాదనలు వినిపించగా.. స్పీకర్ వాటిని రికార్డ్ చేశారు. తనవద్ద ఉన్న సాక్ష్యాధారాలను స్పీకర్ కు అందించారు. మున్సిపల్ ఎన్నికలు, ఫలితాలు అన్నీ పూర్తయ్యాక ఈనెల 19న మరోసారి విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేశారు. అలాగే ఈనెల 18న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కూడా మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వీరిద్దరి విచారణ పూర్తయ్యాక అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -