Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్విద్యార్థిని సన్మానించిన కాకతీయ వాకర్స్ క్లబ్ 

విద్యార్థిని సన్మానించిన కాకతీయ వాకర్స్ క్లబ్ 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పసర హై స్కూల్ నుండి టెన్త్ లో ప్రధమ ర్యాంకు సాధించిన బెజ్జర బోయిన స్రవంతిని కాకతీయ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా కాకతీయ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు మాట్లాడుతూ గ్రామానికి పాఠశాలకు తల్లిదండ్రులకు ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టిన స్రవంతిని సన్మానించడంతోపాటు 8000 రూపాయలను గిఫ్ట్ గా అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా రెండవ ర్యాంకు సాధించిన మెరుగు నాగ చరణ్ ను కూడా సన్మానించి 5000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరిగిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివి ఉత్తమ ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గ్రామానికి తల్లిదండ్రులకు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. అలాంటి వారిని తప్పకుండా కాకతీయ వాకర్స్ క్లబ్ అభిమానిస్తుందని సన్మానిస్తుందని గిఫ్ట్ కూడా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు సుడి శ్రీనివాస్ రెడ్డి.ప్రధాన కార్యదర్శి ,డా||కుమార స్వామి.కోశాధికారి బుక్య బాబురావు తోపాటు అరవై మంది వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -