- Advertisement -
హైదరాబాద్: ఆభరణాల బ్రాండ్ కలాషా ఫైన్ జ్యువెల్స్ తన 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘ది క్వీన్స్ ఛాయిస్’ కలెక్షన్‌ను ఆవిష్క రించింది. గురువారం హైదరాబాద్ లోని తమ షోరూంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు వీటిని విడుదల చేశారు. మహిళల స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ డిజైన్లను రూపొందించామని ఆ సంస్థ డైరెక్టర్ చందా ఆషిక గుప్తా తెలిపారు. మే 30 వరకు సాగే ఈ వేడుకల్లో భాగంగా బంగారం, డైమండ్ ఆభరణాలపై 100 శాతం మేకింగ్ చార్జీల మినహాయింపు వంటి భారీ ఆఫర్లను అందిస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్లు శ్రీనివాస్, చందా, సుధీర్ చందా తెలిపారు. ప్రతీ క్యారట్ డైమాండ్‌ను రూ.46,999కే అందిస్తున్నామన్నారు.
- Advertisement -



