Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాళేశ్వరం రిపోర్ట్ ఫేక్..

కాళేశ్వరం రిపోర్ట్ ఫేక్..

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
కాలేశ్వరం పై ఫేక్ రిపోర్టును సృష్టించారని, సిబిఐ కి అప్పగించడం పై బి ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మండల కేంద్రంలో గులాబి శ్రేణులు, ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపాయి. మంగళవారం రైతుబంధు మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి, సలావత్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. బడే  బాయ్ చోటే బాయ్ ఏక్ హై, కాలేశ్వరం రిపోర్ట్ ఫేక్ హై అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కావాలనే బురద జల్లడానికి అసెంబ్లీ పెట్టారని మండిపడ్డారు. రైతులకు విత్తనాలతో పాటు యూరియాను సరఫరా చేయని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కొత్తోల గంగారాం, ప్రభాకర్ రావు, జంగం లింగం, పాల మల్లేష్, కుశంగి రాజనర్సు, రాజేందర్ గౌడ్, చందర్ నాయక్, కడెం శ్రీకాంత్, భానూరి నరసారెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad