– రెండు నెలలపాటు పొడిగిస్తూ
– రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. జులై 31 వరకు ఈ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఈ కమిషన్ విచారణను పూర్తి చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను సైతం అందించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై గతేడాది నుంచి విచారణ కొనసాగింది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై విచారించింది. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, తదితరులను ప్రశ్నించింది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.
‘కాళేశ్వరం’ విచారణ కమిషన్‌గడువు పొడిగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES