- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
రాష్ట్రస్థాయి యూత్ వాలీబాల్ పోటీలకు మండలంలోని కలిగోట్ పూర్వ విద్యార్థినిలు కృతిక, భవ్య శ్రీ, అక్షర ఈనెల 16 నుండి 19 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో జరిగినటువంటి రాష్ట్రస్థాయి యూత్ వాలీబాల్ పోటీలలో పాల్గొన్నారు. సాన్విక సునాక్షి ఈనెల 20 నుండి 23 వరకు హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ వాలీబాల్ పోటీలలో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థినిలను సర్పంచ్ నాయిక రాజు ఉప సర్పంచ్ సతైవ్వ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



