నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలో గల విశ్వబ్రాహ్మణుల దేవతలైన ఐదు సంవత్సరాల ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలుమన బీబీపేట గ్రామంలో ఈరోజు హై స్కూల్ పక్కన ఉన్న కాళికాదేవి కమటేశ్వర స్వాముల, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబలల ఆలయాలు నిర్మించి ఐదు సంవత్సరాల పూర్తవుతుండడంతో అట్టి దేవతల కళ్యాలాలను ఆదివారం నిర్వహించారు. ఈ కళ్యాణం విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిపించారు. ఈ కాళికాదేవి కమటేశ్వర స్వామి కళ్యాణానికి వస్తే మట్టెలు బీబీపేట మండల కేంద్రానికి చెందిన కమ్మరి సింహం, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల కళ్యాణానికి పుస్తె మట్టలదాత కమ్మరి ఆంజనేయులు, కమ్మరి వెంకటేష్ లు అందించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. బిబిపేట మండల కేంద్రం తో పాటు వివిధ గ్రామాల ప్రజలు ఈ కళ్యాణానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులను పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి తదుపరి అన్నదాన ప్రసాదాన్ని తీసుకోగలరని బీబీపేట విశ్వబ్రాహ్మణ సంఘ కమిటీ తరఫున కోరుతున్నామని పేర్కొన్నారు.
కాళికాదేవి కమటేశ్వర, వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల కళ్యాణనికి పుస్తే మట్టెలు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



