Friday, November 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'కలివి వనం'ఓ అరుదైన సినిమా

‘కలివి వనం’ఓ అరుదైన సినిమా

- Advertisement -

వక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో చిత్రీకరించిన అరుదైన సినిమా ‘కలివి వనం’. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయ లక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్‌, సతీష్‌ శ్రీ చరణ్‌, అశోక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్‌గా నాగదుర్గ పరిచయమవుతోంది. ఈ సినిమాను ఏఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజ్‌ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ నిర్వహించి మీడియా సమావేశంలో రఘుబాబు మాట్లాడుతూ,’పూర్తిగా ఎన్విరాన్మెంటల్‌ బేస్డ్‌గా తీసిన సినిమా ఇది.

నిర్మాతలు మల్లికార్జున రెడ్డి, కృష్ణవర్ధన్‌ రెడ్డి, డైరెక్టర్‌ రాజు నరేంద్ర వీరందరి వ్యాపారాలు వేరు. వీరికి సినిమా ఫీల్డ్‌ టచ్‌ చేయలేదు. అయినా సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఇందులో నేను ఆఫీసర్‌ క్యారెక్టర్‌ చేశాను’ అని తెలిపారు. ‘సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం అని కూడా తెలియపరుస్తూ ఒక విలేజ్‌ డ్రామా ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఒక మంచి మెసేజ్‌ ఇస్తున్నాం. మీరు సినిమా చూసి బయటకి వచ్చిన తరువాత మీలో కూడా ఒక మొక్కను నాటాలన్నటువంటి ఆలోచన మీ మైండ్‌లోకి వస్తుంది’ అని దర్శకుడు రాజ్‌ నరేంద్ర చెప్పారు. ఈ వేడుకలో బిత్తిరి సత్తి, సమెట గాంధీ, హీరోయిన్‌ నాగదుర్గ, అమృతం సీరియల్‌ డైరెక్టర్‌ హరిచరణ్‌ పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -