Sunday, November 9, 2025
E-PAPER
Homeసినిమా'కలివి వనం' రిలీజ్‌కి రెడీ

‘కలివి వనం’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

వక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన సినిమా ‘కలివి వనం’.
రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్‌, సతీష్‌ శ్రీ చరణ్‌, అశోక్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్‌గా నాగదుర్గ పరిచయమవుతోంది.
ఏఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజ్‌ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌లు రవిచంద్ర, ఫణి, కేశవ చారి, సినీ జోష్‌ రాంబాబు, శివ మల్లాల, రాధా కష్ణ ట్రైలర్‌, రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.
నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ,’అడవిలో చెట్లు మనకు ఎంత ఉపయోగ పడతాయన్న దాని మీద ఈ సినిమా చాలా బాగా తీశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మా దర్శక, నిర్మాతలు డబ్బులకు ఎక్కడా వెనకాడకుండా జగిత్యాల పరిసర ప్రాంతాల్లో, అడవుల్లో ఎంతో కష్టపడి చిత్రీకరణ చేశారు’ అని తెలిపారు. ‘సకుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. మనం దేవునితో పాటు ప్రకతిని కూడా పూజించాలి, ఆరాధించాలి, ప్రేమించాలన్న విషయం పిల్లలకి తెలుస్తుందన్న ఉద్దేశంతో తీశాం. ఈనెల 21న వస్తున్న ఈ సినిమాను ఆదరించండి’ అని దర్శకుడు రాజ్‌ నరేంద్ర అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -