గుండెబోయిన రవి గౌడ్ కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
కల్లుగీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం కాసాగాని స్వామి గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుండెబోయిన రవి గౌడ్. బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత 25సంవత్సరాల నుండి ఏజెన్సీలో వృత్తి చేస్తున్న కల్లుగీత కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి సొసైటీలను పునరుద్దరణ చేయాలని సంక్షేమ పథకాలు అందించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏజెన్సీలో రద్దు చేయబడిన సొసైటీలను పునరుద్దరణ చేయాలని వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఆరోజు మాట్లాడడం జరిగిందని వారన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న కల్లుగీత కార్మిక సమస్యల పైన స్పందించకపోవడం సమంజసం కాదని వారన్నారు. 25 సంవత్సరాలుగా ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోకుండా దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని వారన్నారు. తక్షణమే ఏజెన్సీ సమస్యపై ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు అన్నారు. గీత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు వృత్తి పింఛను తక్షణమే అమలు చేయాలని వారు అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాటాల కు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కొరకు నవంబర్ 8న ములుగు జిల్లా కేంద్రంలో జరుగు జిల్లా సదస్సుకు గోవిందరావుపేట మండలం నుండి అధిక సంఖ్యలో గీత కార్మికులు హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి కేజీ కేఎస్.జిల్లా గౌరవ అధ్యక్షులు పంజాల శ్రీనివాసు గౌడ్ జిల్లా కమిటీ సభ్యుడు రంగు సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.అనంతరం నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది.సంఘంమండల అధ్యక్షులుగా రుద్రబోయిన మల్లేష్ గౌడ్ కార్యదర్శిగా వత్సవాయి సారయ్య గౌడ్.. మండల గౌరవ అధ్యక్షులు గా ధోనికేలరాఘవులు గౌడ్.ప్రధాన కార్యదర్శి గా బండపల్లి సాంబయ్య.సహాయ కార్యదర్శి గా చౌగాని ఆంజనేయులు గౌడ్. ఉపాధ్యక్షులు గా మెరుగు సుధాకర్ గౌడ్ జక్కు వేణుగోపాల్ గౌడ్. జక్కు రాజు గౌడ్ కాసగాని బిక్షం గౌడ్.మద్దెల ఐలుమల్లు గౌడ్. కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్. జక్కు రాజమొగిలి గౌడ్ పెరుమాండ్ల మొగిలి గౌడ్. అన్నపురం సదయ్య. మాచర్ల రమేష్ గౌడ్ బోడిగే రంజిత్ గౌడ్ తో పాటు 35 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.



