Tuesday, October 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనవంబర్‌లో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభ

నవంబర్‌లో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభ

- Advertisement -

– 110 మందితో ఆహ్వాన కమిటీ ఏర్పాటు
– గీత కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు : కేజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.వెంకటరమణ
నవతెలంగాణ-సూర్యాపేట

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభ పోరాటాల పురిటిగడ్డ సూర్యాపేట పట్టణంలో నవం బర్‌ 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని రాష్ట్ర అధ్య క్షులు మేకపోతుల వెంకటరమణ ప్రకటించారు. మొదటి రోజు వేలాదిమంది గీత కార్మికులతో ప్రదర్శన, బహిరంగసభ ఉంటుందని, ప్రతినిధుల సభ రెండ్రో జులపాటు నిర్వహిస్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజరు ఫంక్షన్‌ హాల్లో సోమవారం సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవింద్‌ అధ్య క్షతన జరిగిన సమావేశంలో 110 మందితో మహాసభ ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం పోషకంగా బతుకు తున్న లక్షలాది మంది గీత కార్మికుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళిక రూపొందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత సొసైటీలను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. వృత్తిలో ఉపాధి మెరుగుపడాలంటే చెట్ల పెంపకానికి భూమి ఇవ్వాలని, నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని, అందుకు తగిన బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

వీటి అమలుకు బలమైన ఉద్యమాలు నిర్మించేందుకు రాష్ట్ర మహాసభలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేద న్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ రూ.4 వేలకు, ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలన్నారు.

ప్రమాదానికి గురైన గీత కార్మికు లకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా రూ.12 కోట్ల 60 లక్షలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర మహా సభలో చర్చించి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగా లలో అభివృద్ధి సాధించేందుకు తగిన ప్రణాళిక రూపొం దిస్తామన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.వెంకట నరసయ్య, గౌని వెంకన్న, బాల్నే వెంకట మల్లయ్య కార్యదర్శి ఎస్‌.రమేష్‌ గౌడ్‌, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండం కరుణాకర్‌, యమగాని వెంకన్న, అబ్బగాని బిక్షం, తుమ్మల సైదయ్య, ఉయ్యాల నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -