Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవంబర్ 12న కల్లుగీత కార్మిక సంఘం మూడవ మహాసభలు

నవంబర్ 12న కల్లుగీత కార్మిక సంఘం మూడవ మహాసభలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ కల్లగీత కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలు ఈనెల 12వ తేదీన జరగనున్నాయని, ఈ మహాసభలకు ఈ మహాసభలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట రాములు అన్నారు. గురువారం తెలంగాణ కలుగీత కార్మిక సంఘం పత్రిక విలేకరుల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1944లో ఆవిర్భ వించిన సంఘం కల్లుగీత కార్మిక సంఘం, ఎలాంటి ఒత్తిళ్లకు, నిర్బంధాలకు లొంగకుండా వృత్తి రక్షణ కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించుకున్నది. అలాంటి సంఘం 3వ జిల్లా మహాసభలు మన జిల్లాలో జరుపుకుంటున్నాం. ఈ మహాసభలు జయప్రదం చేయడానికి 33 మండలాల్లో ఉన్న గౌడ-గీత కార్మిక సోదరులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కోయెడ నర్సింహులు, శేఖర్ గౌడ్, శ్రీరాంగౌడ్ లుపాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -