నవతెలంగాణ -పెద్దవంగర
సామాజిక ఉద్యమకారుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు భావి తరాలకు స్పూర్తి అని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ కాళోజీ జయంతిని పురస్కరించుకొని, ఆయన చిత్రపటానికి ఎంపీడీవో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. కాళోజీ తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపర్చిన గొప్ప ప్రజాకవి అన్నారు. తన జీవితంలో అన్యాయం ఏ రూపంలో ఉన్న ఎక్కడ ఉన్నా ఎదిరించడమే ఆయన నైజం అని తెలిపారు. అన్యాయాన్ని ఎదిరిస్తే గొడవకు సంతృప్తి, అంతరిస్తే ఆ గొడవకు ముక్తి ప్రాప్తి అన్న గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీవో రామకృష్ణ, ఈసీ సురేష్, జూనియర్ అసిస్టెంట్ సోమన్న, అకౌంటెంట్ మహేందర్ పాల్గొన్నారు.
కాళోజీ భావి తరాలకు స్పూర్తి: ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES