- Advertisement -
నవతెలంగాణ -చారకొండ
చారకొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో కాళోజి నారాయణరావు జయంతి,తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మంజుల మాట్లాడుతూ.. తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజా కవి కాళోజి అని అన్నారు. కాళోజి చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి పద్మ విభూషణ్ తో గౌరవించిందని గుర్తు చేశారు. భావితరాలకు ఆయన రచనలు స్ఫూర్తిని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.
- Advertisement -