నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కల్వకుర్తి పట్టణంలో బందు సంపూర్ణంగా జరిగింది. సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి బిసి సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు పట్టణంలోని బస్ డిపో ముందు నిరసన తెలియజేశారు. కల్వకుర్తి డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళకుండా, పట్టణంలో విద్యాసంస్థలు వ్యాపార సంస్థలు అన్ని మూతపడ్డాయి. బిసి సంఘాల ధర్నాకు మద్దతుగా మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చేవరకు పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ సభ్యులు రాజేందర్, సదానందం గౌడ్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు
బీసీ సంఘాల బందు సంపూర్ణ మద్దతు తెలిపిన కల్వకుర్తి వ్యాపారస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES