Wednesday, November 26, 2025
E-PAPER
Homeజిల్లాలుకల్వకుర్తి సీనియర్ ఖోఖో ముగింపు కార్యక్రమం

కల్వకుర్తి సీనియర్ ఖోఖో ముగింపు కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ కల్వకుర్తి టౌన్ 

కల్వకుర్తి పట్టణంలో గత 12 రోజులుగా జరుగుతున్న  ఖోఖో క్యాంపు ముగింపు సందర్భంగా బుధవారం బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న 58వ ఖోఖో సీనియర్ బాలుర బాలికల క్యాంపు శిబిరాన్ని సామాజికవేత్త రాము, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ కోశాధికారి మధు కుమార్ సందర్శించారు. వారు మాట్లాడుతూ గత 12 రోజులుగా నిర్విరామంగా శ్రమిస్తూ క్రీడాకారులకు క్రీడ నైపుణ్యాలను నేర్పిస్తూ వారిని రాష్ట్రస్థాయిలో ఆడించేందుకు సిద్ధమవుతున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు.

ఇలాంటి క్యాంపు నిర్వహించడం క్రీడాకారులకు ఎంతో ఉపయోగమని, మీ ముందున్న లక్ష్యం ఒకటేనని పెద్దపల్లిలో జరిగే స్టేట్ మీట్ లో మంచి ప్రతిభ కనబరిచి పాలమూరు జిల్లాకు కల్వకుర్తి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. మీ పైన నమ్మకంతో 12 రోజులపాటు క్యాంపు ఏర్పాటుచేసి మీకు సలహాలు సూచనలతో పాటు క్రీడా నైపుణ్యాలను  నేర్పించిన గురువులకు సహకరించిన దాతలకు ఈ క్యాంప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి  నారాయణ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ గోకమళ్ళ రాజు, ఫిజికల్ డైరెక్టర్లు పురణ్ చంద్ ప్రకాష్ జగన్ బాలరాజ్ గౌడ్ బద్రి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -