Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం పలువురు లబ్ధిదారులకు  కళ్యాణ లక్ష్మి చెక్కులను సర్పంచ్ ఏనుగందుల శైలందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. లబ్ధిదారులు అలకుంట గంగు, బాస రజిని, చిన్నవేని శ్రాగవి లకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ నిరుపేదల కుటుంబంలో ఆడబిడ్డ పెండ్లి ప్రస్తుత తరుణంలో ఎంతో కష్టంతో కూడుకున్నదన్నారు. ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఎంతో ఆర్థిక భరోసానిస్తుందన్నారు.

కళ్యాణ లక్ష్మి చెక్కుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ ముత్యాల సునిల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, మండల రెవెన్యూ అధికారి శరత్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్, వార్డ్ మెంబర్లు దాసరి రాకేష్, అజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం రాజేశ్వర్, వన్నెల రాజేశ్వర్, సాదుల్ల, సుంకరి విజయ్, నరేష్, ఆంజనేయులు, నజీర్, మొకిన్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -