- Advertisement -
నవతెలంగాణ- మునుగోడు
మునుగోడు మండలంలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన సంపంగి పద్మ ,హనుమల్ల యాదయ్య కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను సోమవారం తాసిల్దార్ నరేష్ తో కలిసి ఇప్పర్తి గ్రామ సర్పంచ్ చీమల రాజు యాదవ్ లబ్ధిదారులకు మునుగోడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం లో ప్రభుత్వ నుండి వచ్చే పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలను అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ నాయకులు మద్ది చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
- Advertisement -



