బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ, బీర్కూర్ మండలాల 96 మంది కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు రూ 96,11,136/- ల చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజు కలసి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఇందులో బాన్సువాడ గ్రామీణ మండలం 40 మంది లబ్ధిదారులకు రూ 40,04,640లు, బాన్సువాడ మున్సిపాలిటీ 37 మంది లబ్ధిదారులకు రూ 37,04,292లు బీర్కూర్ మండలం 19 మంది లబ్ధిదారులకు రూ 19,02,204లు మొత్తం నియోజక వర్గం లో 96 మంది కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ లబ్ధిదారులకు రూ.96,11,136 ల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే గొప్ప పథకాలు అని పేర్కొన్నారు. అర్హులైన వారికి పథకాలను అందచేయడంలో అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల శ్రీనివాస్ వైస్ చైర్మన్ రాములు, దామరంచ సర్పంచ్ బోయిని శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ నాయకులు శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.



