నవతెలంగాణ – వీర్నపల్లి
నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం కొండంత అండగా నిలుస్తుందని ఏ ఎం సి చైర్మన్ రాములు నాయక్, సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ పేర్కొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతు ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ నగదును సద్వినియోగం చేసుకోవాలన్నారు .అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎటువంటి పైరవీలు లేకుండా నేరుగా లబ్ధి చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఇంచార్జి తహశీల్దార్ ముక్తార్ పాషా,ఎంపిడివో శ్రీలేఖ, అర్ ఐ శివ కుమార్, సర్పంచ్ లు మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్, రమేష్, గంగా రెడ్డి, సుధాకర్,శ్రీకాంత్, పుష్ప లత, లత ,సాయిలు, కృష్ణ, నీల బాయి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఏ ఎం సి డైరెక్టర్ చంద్ర మౌళి, దేవయ్య, శివ రామ కృష్ణ, నరేష్, శ్రీనివాస్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



