నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఆడపిల్లలకు పెళ్లి చేసిన వెంటనే ఆధారాలతో సహా సంబంధిత అధికారి వద్ద అప్లై చేసుకున్న వెంటనే కల్యాణ లక్ష్మి చెక్కులు ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
హుస్నాబాద్ మండల, మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ లో ఉన్న 25 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులకు ఆటంకం లేకుండా పేమెంట్ చేస్తున్నామని చెప్పారు. భవిషత్ లో కూడా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఆలస్యం కాకుండా వెంట వెంటనే చెక్కులు పంపిణీ చేస్తాం..ఎక్కడ కూడా పెండింగ్ లో లేవన్నారు. చెక్కులు వచ్చిన దంపతులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ బిండ చైర్మన్ శివన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు,మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ ఆర్డిఓ రామ్మూర్తి, ఎమ్మార్వో లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.