Saturday, July 26, 2025
E-PAPER
Homeసినిమాఅభినయ కృష్ణ దర్శకత్వంలో 'కామాఖ్య'

అభినయ కృష్ణ దర్శకత్వంలో ‘కామాఖ్య’

- Advertisement -

సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో ఓ థ్రిల్లింగ్‌ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘కామాఖ్య’ అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ ఖరారు చేశారు. డివైన్‌ వైబ్‌తో ఉన్న టైటిల్‌ పోస్టర్‌ అందర్నీ అలరిస్తోంది. డైరెక్టర్‌ అభినయ కష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో యూనిక్‌ కథని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ఆనంద్‌, శరణ్య ప్రదీప్‌, వైష్ణవ్‌, ధనరాజ్‌, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
‘హాస్యనటుడుగా అభినయ కృష్ణకు మంచి గుర్తింపు ఉంది. ఆయన నటుడు మాత్రమే కాదు. ఆయనలో ఓ మంచి రచయిత, అలాగే దర్శకుడూ ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఓ మంచి కథ రాశారు. ఈ కథకి తగ్గట్టుగానే పవర్‌ఫుల్‌ టైటిల్‌ ‘కామాఖ్య’ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో సముద్రఖని, అభిరామి పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి ప్రేక్షకుల్ని తప్పకుండా సర్‌ప్రైజ్‌ చేస్తాయి. అలాగే ఈ సినిమాతో అభికి దర్శకుడిగా మంచి పేరొస్తుంది. సినిమా చాలా బాగా వస్తోంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని మేకర్స్‌ చెప్పారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: అభినయ కష్ణ, డిఓపి: రమేష్‌ కుశేందర్‌ రెడ్డి, సంగీతం: గ్యాని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శ్రీహరి గౌడ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: భూపతి యాదగిరి, స్టంట్స్‌: రాజేష్‌ లంక, కొరియోగ్రాఫర్‌: ఈశ్వర్‌ పెంటి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -