Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా

కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా

- Advertisement -

కన్నడ భాషా వివాదం వేళ తాజా పరిణామం
చెన్నై :
ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ తన రాజ్యసభ నామినేషన్‌ను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తున్నది. కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ కమల్‌ హాసన్‌ను రాజ్యసభకు పంపించాలని ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రాజ్యసభ నామినేషన్‌కూ కమల్‌ హాసన్‌ సిద్ధమయ్యారు. అయితే తాజా పరిణామాలతో తన రాజ్యసభ నామినేషన్‌ దాఖలును ఆయన వాయిదా వేసుకున్నారు. కన్నడ భాష మూలాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారటం, తదనంతర పరిణామాల కారణంగానే కమల్‌ హాసన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభకు నామినేషన్‌ వేసే ప్రక్రియను కమల్‌ హాసన్‌ కొన్ని రోజులు వాయిదా వేసుకున్నట్టు సమాచారం. థగ్‌ లైఫ్‌ సినిమా విడుదలైన తర్వాతే కమల్‌ హాసన్‌ నామినేషన్‌ వేసే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమిళనాడులో అధికారంలో ఉన్న ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)కు కమల్‌ హాసన్‌ పార్టీ ఎంఎన్‌ఎం మద్దతు తెలిపింది. ఎన్నికల వేళ.. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కమల్‌ హాసన్‌కు రాజ్యసభ సీటును కేటాయిస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మే 28న డీఎంకే అధికారికంగా ఆరు రాజ్యసభ సీట్లలో మూడు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కమల్‌ హాసన్‌ పేరు కూడా ఉంది. దీంతో కమల్‌ హాసన్‌ పార్లమెంట్‌లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. త్వరలోనే తమిళనాడు నుంచి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేయడానికి జూన్‌ 19న ఎన్నికలు జరగనున్నా యి. ఈ నేపథ్యంలోనే కమల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏమిటీ వివాదం?
తన సినిమా థగ్‌ లైఫ్‌ ఈవెంట్‌లో భాగంగా మాట్లాడిన కమల్‌ హాసన్‌.. తమిళం నుంచి కన్నడ పుట్టిందని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నడ అనుకూల సంఘాలు.. కమల్‌ హాసన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయడంతో పాటు ఆయన సినిమాను రాష్ట్రవ్యాప్తంగా బహిష్కరించా లని పిలుపునిచ్చాయి. కన్నడ సంఘాల నిర్ణయంతో కర్నాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా థగ్‌ లైఫ్‌ సినిమా విడుదల, థియేటర్లలో షోలు నిలిపివేయాలని నిర్ణయించింది. దీనిపై కర్నాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌.. విచారణ సందర్భంగా ఆ రాష్ట్రంలో తన సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. తాను తప్పు చేయలేదనీ, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని పేర్కొన్న కమల్‌ హాసన్‌.. క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad