- Advertisement -
హైదరాబాద్ : హెచ్‌సీఏ బి డివిజన్ రెండు రోజుల లీగ్‌లో యువ బౌలర్ కమల్ స్వరూప్ సత్తా చాటుతున్నాడు. రెండు మ్యాచుల్లో 8 వికెట్లతో మెరిశాడు. చార్మినార్‌తో మ్యాచ్‌లో కమల్ స్వరూప్ ఐదు వికెట్లతో చెలరేగగా ఆ జట్టు 53.4 ఓవర్లలో 184 పరుగులకే కుప్పకూలింది. తొలి రోజు ఆట ముగిసే సరికి సలీంనగర్ 28.4 ఓవర్లలో 147/5తో ఆడుతోంది.
- Advertisement -