– రిస్క్ టీంతో వరదల్లో చిక్కుకున్న వారినీ కాపాడుతున్న పట్టణ సీఐ నరహరి
– హౌసింగ్ బోర్డ్ కాలనీలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
నవతెలంగాణ – కామారెడ్డి
మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కు కామారెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు ( ఇవి గతంలో చెరువులు, కుంటలు ) పూర్తిగా ఆతులం కుతులం అయింది. పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల డ్రైనేజీలు పొంగి పోలడంతో పొర్లాడంతో రోడ్లు గుంతలుపాడి, తెగిపోవడం జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి పట్టణంలో జి ఆర్ ( గోస్క రాజయ్య ), హౌసింగ్ బోర్డ్ కాలనీలో కార్లు కొట్టుకపోవడం,, హైదరాబాద్ ప్రధాన రహదారి రోడ్డు తెగిపోవడం, ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఎక్కడికక్కడ వరదల్లో చిక్కుకుపోవడంతో రిస్క్ టీం తో కలిసి పట్టణ సీఐ నరహరి స్వయంగా సహాయక చర్యలో పాల్గొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
దర్శన్ టాక్స్ వెనకాల లక్ష్మీ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర భారీగా వరదలు రావడంతో బైకులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, పంచముఖి హనుమాన్ గుడి ముందు నుండి భారీగా వర్షాలు తో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయినాయి ప్రజలకు పోవడానికి కూడా వీలు లేదు పంచముఖి హనుమాన్ గుడి ఎదురుగా నీరు చెరువును తలపించింది. కామారెడ్డి పట్టణానికి ఆనికొని ఉన్న ఉగ్ర వై వృద్ధాశ్రమం వెనకాల గొర్రెలు చిక్కుకుపోవడంతో వాటిని కాపాడడం జరిగింది. ప్రజలను కాపాడేందుకు వెళ్లిన సీఐ నీటిలో కొట్టుకపోగా రిస్క్టింగ్ సిబ్బంది ఆయనను కాపాడారు.