నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ విద్యార్థుల సంక్షేమానికి అందిస్తున్న విశేష సేవలకుగాను గురువారం జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రంథాలయానికి వచ్చే విద్యార్థిని, విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటి సౌకర్యం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.5 లక్షల వ్యయంతో వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేశారు.
అలాగే ఫస్ట్ ఫ్లోర్‌లో చదువుకునే విద్యార్థుల కోసం క్యాబిన్ (క్యాపిటెన్) వ్యవస్థను రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఇదే విధంగా జిల్లాలో గ్రంథాలయ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో విద్యార్థుల చదువుకు తోడ్పడేలా ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించారు. విద్యార్థులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నందుకు గ్రంథాలయ చైర్మన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా కన్వీనర్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, కొంపల్లి జయభేరి, గోపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, క్యాసంపల్లె మాజీ సర్పంచ్ కోరందులు అంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



