నవతెలంగాణ-రామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న అతివృష్టి కి కామారెడ్డి జిల్లా అతలాకుతులమైంది. రామారెడ్డి మండలంలో గంగమ్మ వాగులో బుధవారం సాయంత్రం 7 గం రెడ్డిపేటకు చెందిన బొట్టు గణేష్, సిరి గారి రాజు కామారెడ్డి నుండి రెడ్డి పేట వెళ్తుండగా వరద నీటిలో చిక్కుకొగా గణేష్ అప్రమత్తమై బోరు మోటర్కు చెందిన పైపును పట్టుకొని బయటకు రావడంతో, విషయాన్ని పోలీసులతోపాటు గ్రామస్తులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, రెండు రెస్యూటీoలతో 7 గం శ్రమించి , 8 గం తుమ్మ చెట్టు కొమ్మను పట్టుకొని ఉన్న రాజును రక్షించి, ఒడ్డుకు తరలించారు. గన్ పూర్ వాగులో ద్విచక్ర వాహనం, వ్యక్తి కొట్టుకుపోతుండగా, స్థానికులు గమనించి రక్షించారు. ఆయా గ్రామాల్లో చెరువుల మత్తడులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గురువారం ఉదయం నుండి భారీ వర్షంతో జనజీవనం స్తంభించి, ఒక ఊరి నుండి మరొక ఊరికి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రజలకు ఎక్కడికక్కడ సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
అతివృష్టితో కామారెడ్డి కల్లోలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES