Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి పోలీస్ శాఖ కొత్త లోగో ఆవిష్కరణ

కామారెడ్డి పోలీస్ శాఖ కొత్త లోగో ఆవిష్కరణ

- Advertisement -

మార్పుకు నాంది పలికిన జిల్లా ఎస్పీ
పారదర్శకతతో ముందుకు సాగుతున్న కామారెడ్డి పోలీసింగ్
ప్రజల భద్రతే ధ్యేయం జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర 
నవతెలంగాణ – కామారెడ్డి
: కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ, జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర  మంగళవారం కొత్త లోగోను ఆవిష్కరించారు. ఫియర్లెస్ హాలిడేస్, విజిలెన్స్ విజిలెంట్ ఫరెవర్  అనే నినాదంతో రూపొందిన ఈ లోగో, పోలీసింగ్‌లో ధైర్యం, అప్రమత్తత, పారదర్శకతను ప్రతిబింబించడమే కాకుండా, పోలీసింగ్‌లో వస్తున్న మార్పుకు ప్రబలమైన ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఇందులో ప్రతిఫలించే నినాదం జిల్లా పోలీసుల నిబద్ధతను, కమిట్‌మెంట్‌ను స్పష్టంగా వ్యక్తపరుస్తోంది. ఈ లోగోను జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, అధికారిక పత్రాలు, సోషల్ మీడియా వేదికలలో అమలులోకి తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ  ఈ లోగో కేవలం గుర్తింపు మాత్రమే కాదు, కామారెడ్డి పోలీస్ శాఖ నిబద్ధత, ప్రజల పట్ల బాధ్యతా భావం, న్యాయబద్ధమైన విధానాలను ప్రతిబింబిస్తుందన్నారు. పోలీసింగ్‌ను ప్రజలకు మరింత సమీపంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం అని పేర్కొన్నారు. పారదర్శకతే మా బలం – ధైర్యమే మా ఆయుధం అనే లక్ష్యంతో పోలీసులు వ్యవహరించాల్సిన దిశగా మార్గదర్శకాలు రూపొందించామని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రతి అధికారి శ్రద్ధగా, సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ప్రజల మద్దతుతో మరింత శక్తివంతమైన పోలీసింగ్‌ను అందించేందుకు సిద్దంగా ఉందన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad