Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి దివ్యాంగుల అథ్లెటిక్ పోటీల్లో కామారెడ్డి విద్యార్థుల సత్తా

రాష్ట్రస్థాయి దివ్యాంగుల అథ్లెటిక్ పోటీల్లో కామారెడ్డి విద్యార్థుల సత్తా

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
హైదరాబాద్ లోని దోమలగూడ పిడి గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల అథ్లెటిక్ పోటీలలో కామారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచి 12 కప్పులను కైవసం చేసుకున్నారు. అండర్ – 14 , అండర్ – 19 విభాగాలలో నిర్వహించిన 50 మీటర్ల పరుగు పందెం, డిస్కస్ త్రో, జిగ్‌జాగ్ వాకింగ్, మ్యూజికల్ చైర్ వంటి విభిన్న పోటీలలో కామారెడ్డి జిల్లా నుండి మొత్తం 30 మంది దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో జై కృత, పి. రితీష్, జీ. రితీష్, పూజిత, సాకేత్, రిషిక, భాను ఉదయ్, నియా తదితరులు ప్రతిభ చూపించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి బంగారు పతకాలు, అథ్లెటిక్ ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. పురస్కారాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్, జెడి మేడం చేతుల మీదుగా విద్యార్థులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి ప్రత్యేక ఉపాధ్యాయులు సారిక, భక్తమాల, ఉపాధ్యాయుల బృందం విజేత విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా దివ్యాంగ విద్యార్థులు ఎటువంటి పరిమితులు తమ ప్రతిభకు అడ్డుకావని ఈ విజయంతో మరోసారి నిరూపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -