Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో 2026-27 సంవత్సరానికి అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో ఎన్నుకున్నట్లు తెలిపారు.

కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా లుక్క గంగాధర్, ఉపాధ్యక్షులుగా భోగ శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా చిలివేరి పవన్ కుమార్, కోశాధికారిగా చిలువేరి ప్రసాద్, సహాయ కార్యదర్శిగా కొమ్ముల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన లుక్క గంగాధర్ మాట్లాడుతూ కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ను సభ్యులందరి  సహకారంతో, సమన్వయంతో క్లబ్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా నిస్వార్థంతో సేవలు అందిస్తామని, బ్యాడ్మింటన్ లో నూతన క్రీడాకారులను తయారు చేయడంలో తమ వంతు కృషి ఉంటుందని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షులు తో పాటు కార్యవర్గ సభ్యులను తోటి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -