నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎస్ డి బుష్రా సీఎం కప్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న గురువారం తెలిపారు. ఈ నెల 20నుండి 23వ తేదీ వరకు మెదక్ లో జరిగే రాష్ట్ర స్థాయి సీఎం కప్ సాఫ్ట్ బాల్ పోటీలలో బుష్రా పాల్గొంటుందని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి సీఎం కప్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన బుష్రా ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోగ రామ స్వామి, సభ్యులు బుచ్చి మల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.



