Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాఫ్ట్ బాల్ లో రాష్ట్ర స్థాయికి కమ్మర్ పల్లి విద్యార్థుల ఎంపిక

సాఫ్ట్ బాల్ లో రాష్ట్ర స్థాయికి కమ్మర్ పల్లి విద్యార్థుల ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు భవాని, వర్షిత్ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం తెలిపారు. ఈ నెల తేదీ 21 నుండి 23వరకు కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో స్థానిక గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో (క్రీడా ప్రాంగణం) జరిగే 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ లో విద్యార్థులు భవాని, వర్షిత్ పాల్గొంటారని తెలిపారు. సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కు ఎంపికైన  పాఠశాల విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం, సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, కార్యవర్గ సభ్యులు,  అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -