Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లి విజయ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం

కమ్మర్ పల్లి విజయ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో విజయ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శుక్రవారం విజయ సంగం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంఘ సభ్యుల సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం  నూతన అధ్యక్షులుగా చింత శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బొడ్డు గణేష్, కార్యదర్శిగా చిలివేరి వినోద్ కుమార్, కోశాధికారిగా సిలివేరి వేణు గోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా సిలివేరి శ్రీనివాస్ ( దుబాయ్ ), ఆడిచర్ల రాజ్ కుమార్, రాపెల్లి ఉదయ్, సురుకుట్ల నరేష్, రేగుంట సాయిరాం, గుడ్ల నవీన్, రేగుంట శంకర్, చింత గణేష్, కట్కo రాజు, కరేగాం రమేష్, సిరిమల్ల గంగాధర్, బొద్దుల రాజేష్, చింత సత్యపాల్ ఎన్నికయ్యారు. దైవశెట్టిలుగా  పోతు అర్జున్, చిలివేరి దేవేందర్ నియామకమయ్యారు.

సలహాదారులుగా చింత హన్మంతు (ఆటో), భోగ రామస్వామి లను నియమించారు. నూతనంగా ఎన్నికైన సంఘం కార్యవర్గానికి సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షులు చింత శ్రీనివాస్ మాట్లాడుతూ విజయ పద్మశాలి సంఘం అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు పద్మశాలి కుల దైవం మార్కండేయ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -