కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం..
ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – వీర్నపల్లి
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేష్ (24) దుబాయ్‌కి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. ఈ క్రమంలో అప్పుల బాధ తాళలేక శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాకేష్ పేద కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పుడే తండ్రి మరణించగా, తల్లి కూలి పనులు చేస్తూ రాకేష్‌ను, అతని సోదరుడిని పెంచి పెద్ద చేసింది. కుటుంబ కష్టాలు తీర్చాలని దుబాయ్ వెళ్లిన రాకేష్‌కు అక్కడ ఆశించిన స్థాయిలో వేతనం అందలేదు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికయ్యే ఖర్చులను భరించే శక్తి ఆ కుటుంబానికి లేకపోవడంతో ఎమ్మెల్యే కేటీఆర్, సర్పంచ్ సామల్ల దేవరాజ్, వడ్డెర సంఘం ప్రెసిడెంట్ గోగుల రమేష్‌ను కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. కేటీఆర్ స్పందించి మతదేహాన్ని త్వరగా రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి, దిక్కులేని ఆ నిరుపేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు, వడ్డెర సంఘం నాయకులు కోరుతున్నారు.
అప్పుల బాధతో దుబాయ్‌లో కంచర్ల వాసి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



