– ఏడిఏ అపర్ణ
నవతెలంగాణ – కామారెడ్డి
కంది పంట రైతులు తమ పంటపై ఆశించే పురుగులపై ప్రత్యేక సిద్దపెట్టాలని ఏ డి ఏ అపర్ణ అన్నారు. శుక్రవారం రాజంపేట మండలంలో ఆమె కందిపెట్టండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కామారెడ్డి డివిజన్లో కంది పంట 418 ఎకరాలలో సాగులో ఉందనీ, ఈ పంటకు ప్రస్తుతము ఆకుగూడు పురుగు, మార్కా మచ్చల పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నాయన్నారు. ఈ పురుగుల వల్ల దిగుబడి తక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ, ఈ పురుగులను గనక సమర్థవంతంగా అరికట్టగలితే రైతులు మంచి దిగుబడి ఆశించవచ్చన్నారు. ఆకుగూడు పురుగు పూత దశలో ఎక్కువగా ఆశిస్తుందనీ, లార్వాలు చిగురు ఆకులను గూడులును చేసి లోపల ఉండి ఆకులను తింటాయనీ, ఒక్కొక్కసారి పువ్వులను లేత కాయలను తింటాయనీ, దీని నివారణకు క్వినాల్ ఫాస్ 25 శాతం, ఈసీ రెండు మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేసుకోవాలనీ, ఇంకొక ప్రధాన పురుగు మార్క మచ్చలు పురుగు తల్లి రెక్కల పురుగు కోడిగుడ్డు ఆకారంలో గల పశుపచ్చని గుడ్లను పూమొక్కల పైన లేత ఆకుల పైన పిన్నులు పైన పెడుతుందన్నారు.
గుడ్ల నుండి వెలువడిన లార్వాలు ఆకులను పువ్వులను కాయలను కలిపి గూళ్ళుగా చేసి తొలిచితింటాయనీ, తొలిచిన కాయ రంద్రము దగ్గర లార్వా విసర్జితాలు కల్పిస్తాయి దీని నివారణకు. క్లోరి ఫైరిఫాస్ 20 శాతం ఈసీ 2.5 యంఎల్ లేదా నోవారులాన్ 10 శాతం ఈసీ ఒక మిల్లీలీటరు లీటర్ నీటికి చొప్పున 200 లీటర్ల స్ప్రే ఫ్లూయిడ్ పంట పైన పిచికారి చేయలన్నారు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ 45 శాతం ఎస్ సి 0.3 మిల్లీలీటర్లు లేదా ఏమామెట్టిన్ బెంజోయేట్ అయిదు శాతం ఎస్జి 0.4 గ్రాములు ఫ్లూ బెండమైడ్ 0.2 యంఎల్ లేదా క్లోరంట్రా నీ ప్రోల్ పాయింట్ 0.3 మిల్లీలీటర్లు లేదా లామడ సహలోత్రిన్ 5 శాతం ఈసీ 1 మిల్లీలీటరు, లీటర్ నీటికి చొప్పున 200 లీటర్ల స్ప్రే ఫ్లోయెడు పంట పైన ఒక ఎకరానికి స్ప్రే చేయాలనీ, ఈ చర్యలు పాటించి నాణ్యమైన కంది పంట దిగుబడిగా తీసుకోవాలని రైతులకు సూచించడం జరుగుతుందన్నారు.



