నవతెలంగాణ – కాటారం
జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో కాటారం మండలంకు చెందిన కందుగుల రాజన్న ను మంథని నియోజకవర్గం ఇంచార్జీ గా నియమించడం జరిగినది. ఆదివారం రోజున మంథని పట్టణంలోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ మాల మహానాడు కమ్యూనిటి హాల్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల బాణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కందుగుల రాజన్న మాట్లాడుతూ… ఈ నెల 8 సోమవారం రోజున మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాల సామాజిక వర్గానికి జరిగిన రోస్టర్ విధానం రద్దు చేయాలని వినతి పత్రం అందజేయడం జరుగుతుందని అన్నారు. త్వరలో జాతీయ మాల మహానాడు నియోజకవర్గం, డివిజన్, మండల కమిటిలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు అప్పాల పోచమల్లయ్య, టీం అధ్యక్షులు నూకల శంకర్, మండల అధ్యక్షులు జంజర్ల రాజు, ఎరుకల ప్రవీణ్, బండి రాజయ్య, కొవ్వూరి రాజలింగు, కొవ్వూరి వేణు ప్రసాద్, పసుల పోచయ్య, బొడ్డేల్లా రవి, ఆర్ల జ్ఞాని, డికొండ లక్ష్మణ్, జంజర్ల శ్రీనివాస్, ఆర్ల సందీప్, లింగాల సురేష్, నవ రమేష్, రావుల మొగిలి, వెంకటేష్ లు పాల్గొన్నారు.