Friday, October 17, 2025
E-PAPER
Homeఆటలుసూపర్‌జెయింట్స్‌ అడ్వైజర్‌గా కేన్‌ విలియమ్సన్‌

సూపర్‌జెయింట్స్‌ అడ్వైజర్‌గా కేన్‌ విలియమ్సన్‌

- Advertisement -

లక్నో : ఈ ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత న్యూజిలాండ్‌ తరఫున మళ్లీ ఆడని స్టార్‌ క్రికెటర్‌ విలియమ్సన్‌.. ఐపీఎల్‌లో కొత్త అవతారం ఎత్తాడు. కేన్‌ విలియమ్సన్‌ 2026 ఐపీఎల్‌కు లక్నో సూపర్‌జెయింట్స్‌తో జట్టు కట్టాడు. సూపర్‌జెయింట్స్‌కు వ్యూహాత్మక సలహాదారుగా కేన్‌ విలియమ్సన్‌ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు లక్నో సూపర్‌జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా గురువారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. కోల్‌కత నైట్‌రైడర్స్‌ స్పిన్‌ కన్సల్టెంట్‌ కార్ల్‌ క్రోవీ సూపర్‌జెయింట్స్‌ కొత్త స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌కు జస్టిన్‌ లాంగర్‌ (ఆస్ట్రేలియా) చీఫ్‌ కోచ్‌గా, భరత్‌ అరుణ్‌ (భారత్‌) బౌలింగ్‌ కోచ్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -