- Advertisement -
– కండువా కప్పి ఆహ్వానించిన మహేష్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ మంత్రి లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి-చంద్రకాంత్ యాదవ్ దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సనత్‌నగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి కోట నీలిమ ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, విజయారెడ్డి, కార్పొరేషన్ చైర్మెన్లు తదితరులు ఉన్నారు.
- Advertisement -