Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'కన్నప్ప'ను గొప్పగా ఆదరిస్తున్నారు

‘కన్నప్ప’ను గొప్పగా ఆదరిస్తున్నారు

- Advertisement -

విష్ణు మంచు నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘కన్నప్ప’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ దక్కింది.
డివోషనల్‌ బ్లాక్‌ బస్టర్‌గా ఈ చిత్రం ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం విజయవాడలో గజల్‌ గాయకుడు, సేవ్‌ టెంపుల్స్‌ భారత్‌ సంస్థ అధ్యక్షులు గజల్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఎం.మోహన్‌ బాబుతో పాటు నాగ సాధువులు, అఘోరాలు ఈ ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా మోహన్‌ బాబు మాట్లాడుతూ,”కన్నప్ప’ సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతీ చోటా మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. గజల్‌ శ్రీనివాస్‌ నేతత్వంలో నిర్వహించిన ఈ ప్రత్యేక షోను నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి వీక్షించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
”కన్నప్ప’ను వెండితెరపైకి మళ్లీ తీసుకురావడం ఓ గొప్ప నిర్ణయం. చిత్రం అద్భుతంగా ఉంది. విష్ణు నటన కన్నుల విందుగా అనిపించింది. కన్నప్ప జీవితాన్ని మరోసారి ఇంత అద్భుతంగా తీసిన నిర్మాత మోహన్‌ బాబుకి ధన్యవాదాలు. సంపూర్ణమైన భక్తి రస చిత్రంగా తీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది’ అని గజల్‌ శ్రీనివాస్‌ చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad