- Advertisement -
- వీర తెలంగాణ రైతు సాయుధ పోరాట..
- దళ కమాండర్ కన్నెకంటి రంగయ్య..
- జననం 1920.. మరణం సెప్టెంబర్ 12, 2025
- తూటాలకు ఎదురొడ్డి.. ఆగా మోత్కూర్ లో రజాకార్ల క్యాంపు దాడి
- వెట్టిచాకిరీకి, లెవీ-గల్లాకు వ్యతిరేకంగా ఉద్యమం
- వెన్నుపోటుతో జైలుకు రంగయ్య… ఆరు ఏండ్లు జైలు జీవితం
- తొలి సర్పంచ్ గా… మిర్యాలగూడ ఎంపీపీగా సేవలు
నవతెలంగాణ-నల్లగొండ : ప్రాంతీయ ప్రతినిధి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి కన్నెకంటి రంగయ్య స్వగ్రామం. వడ్రంగికుటుంబం నుండి వచ్చిన రంగయ్య తెలంగాణా సాయుధ పోరాటంలో దళ కమాండర్ గా బాధ్యతలు నిర్వహించారు. 1920వ సంవత్సరంలో కన్నెకంటి సోమయ్య, రామలక్ష్మమ్మలకు జన్మించిన ఐదుగురి సంతానంలో రంగయ్య నాల్గవవాడు. స్వగ్రామానికి దగ్గర్లో ఉన్న మిర్యాలగూడ ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి వరకుచదవుకున్నారు. అయితే 1941-42 సమయంలో రెండవ ప్రపంచయుద్ధంలో సైనికునిగా.రంగయ్య చేరారు.. మిలట్రీ వాళ్ళకు అక్కడి ప్రాంతాన్ని చూపెట్టడం ఆయన బాధ్యత. ఉండేది. ఆసమయంలో ఆంధ్రమహాసభ గురించి విన్నారు. ‘అది ఏం చేస్తుందో తెలుసుకోవాలనే’ కోరిక ఉద్యమం వైపు నడిపించింది. ‘ఒకే భాష మాట్లాడేవారందరూ ఒకటే’ అనే ఆంధ్రమహాసభ పిలుపు రంగయ్యను బాగా ఆకర్షించింది. దీంతో ఆంధ్రమహాసభ గురించి తెలుసుకోవాలనే కోరిక మనస్సులో వేధించింది. విద్యార్ధిగా ఉన్నపుడు చిలుకూర్ లో జరిగిన ఆంధ్రమహాసభకు కాలినడకన వెళ్ళారు.. అక్కడ ధర్మభిక్షం, నంద్యాల శ్రీనివాసరెడ్డిలను మొదటిసారిగా చూశారు. ఆ తరవాత ఆ ప్రాంతంలో ఆంధ్రమహాసభ కార్యక్రమాలు నిర్వహించు మొదలు పెట్టారు. దీంతో ఆయన తండ్రి రంగయ్యను వరంగల్ జిల్లామహాబూబాబాద్ సమీపంలోని దేవుని సంకీశలో ఉండే పెద్దమ్మ కొడుకు వద్దకు పంపించాడు. అక్కడ వడ్రంగి పనిలో వారికి సహాయపడుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటానని వాళ్ల నాన్న భావించారు. అయితే అక్కడ కూడా ఆంధ్రమహాసభ తమ్మ శేషయ్య అనే అతను. ఆంధ్రమహాసభ నాయకునిగా ఉన్నారు. కొండపల్లి గోపాలరావు తీగల సత్యనారాయణ తదితరుల నాయకత్వంలో పనిచేయడం మొదలుపెట్టారు యువజన సంఘం ఏర్పాటు చేసి రాత్రి బడులు నడిపారు. 1945లో ఖమ్మంలో జరిగిన ఆంధ్రమహాసభకు వంద మందిని తీసుకెళ్లారు. ఆ సమయంలో యువజన సంఘం కార్యదర్శిగా ఉన్న రంగయ్య వాలంటీర్ గా పనిచేశారు. గోల్కొండ పత్రికలో రంగయ్య పేరు కూడా వచ్చింది.
వెట్టిచాకిరీ, లెవీ-గల్లాకు వ్యతిరేకంగా ఉద్యమం
1946లో. వెట్టిచాకిరీకి, లెవీ-గల్లాకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మొదలు పెట్టా రు. దీంతో మహాబూబాబాద్ పరిధిలోని నె ళ్లికూర్ పోలీస్ స్టేషన్ లో రంగయ్య. పై అరెస్టు వారెంటు జారీ అయ్యింది. ఆయన దొరక్కపోవడంతో అరెస్టు వారెంటువల్ల రంగయ్య పెద్దమ్మ కొడుకు(అన్న)ను పోలీసులు పట్టుకుపోయారు. దీంతో వాళ్ల అన్న రంగయ్యను వాళ్ల ఊరికిపంపించాడు.
1947 ఆగష్టులో అక్కడ ఎర్రజెండాలు కట్టి మిర్యాలగూడ ప్రాంతానికి వచ్చారు. .మహాబూబాబాద్ నుండి మిర్యాలగూడ ప్రాంతానికి వచ్చిన అనంతరం ఉద్యమంతో సంబంధాలుఏర్పర్చుకున్నారు. మొదట్లో కరపత్రాలు రాయడం, అంటించడం ఉత్సాహంగా చేసేవారు . స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ వారితో కలిసి మూడు రంగుల జెండాలు కట్టారు. అక్కడ నుండి పల్నాడు తాలుకాలోనికాలేపల్లికి వెళ్ళి ఆర్గనైజర్ చల్లా సీతారాంరెడ్డిని కలిసారు. రామాపురం తాలుకాలోని కాట్రాపురంలో రంగయ్యను ఏంట్రీ శిక్షణకు పంపించారు. అక్కడ కట్కూరి రాఘవరెడ్డి, సుబ్బారెడ్డి, పోలబోయిన గోపయ్య తదితరులు కలిసారు. శిక్షణ అనంతరం దళాలుగా ఏర్పడ్డారు. దొడ్డా నర్సయ్య, చల్లా సీతారాంరెడ్డి కంపెనీ(పెద్దసంఖ్యలో రంగయ్య దళ సభ్యునిగా ఎన్నికయ్యారు. మొత్తం 150 మంది ఉండేవారు. కోదాడలోని అనంతగిరిలో సమావేశం చేసి చిన్నదళాలను ఏర్పాటు చేశారు. ఎనిమిది దళాలు ఏర్పాటు అయ్యాయి.. రావులపెంట, మిర్యాలగూడ, పాములపాడు తదితర ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసినరంగయ్యను కమాండర్ గా నియమించారు.- గోపయ్య, మట్టయ్య, వెంకటనర్సయ్య, సుబ్బయ్య, సత్తిరెడ్డి, రామనర్సు (రావులపెంట), అప్పారెడ్డి,వెంకడకమళ్ళ), ఎల్లయ్య (మొల్కపట్నం)లతో పాటు మరికొంతమంది రంగయ్య దళంలో సభ్యులుగా అది వారిని దెబ్బకొట్టడం కోసం క్యాంపుపై దాడి చేశారు. ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెట్టారు. ఆ దళం ఇతర దళాలతో కలిసి అనేక దాడులు చేసింది. ఆగా. మోత్కూర్లో రజాకార్ల క్యాంపు ఎత్తేశారు. యాక్షన్ అనంతరం మిలట్రీ క్యాంపు పెడితే మళ్ళీ దాడి చేశారు. తిట్టకుంట వద్ద సీతారాంరెడ్డి ఆధ్వర్యంలో రక్షణ తీసుకుంటుండగా నిజాం పోలీసులు దళం పై కాల్పులుజరిపారు. ఒకతూట రాయికి తగిలి వచ్చి రంగయ్య కాలికి తగిలింది. రాయినిపాలెం వద్ద ఒకసారి నిజాం పోలీసులు మాపై కాల్పులు జరిపారు. తక్కెళ్లపాడు పోలీసు పటేల్ ను ప్రజలు చంపివేశారు. ఉట్లపల్లిలో రక్షణ తీసుకునివంటలు వండారు తినేందుకు సిద్ధమవుతుండగా శత్రువులుచుట్టు ముట్టాయి అయితే ఎదురుకాల్పులు జరుపుతూ అక్కడి నుండి బయటపడ్డారు. వాళ్ల సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తినికొద్దిరోజుల తరువాత చంపివేశారు. ప్రజల నుండి పూర్తి సహాకారం అందేది.
నిర్బంధం సాగింది ఇలా
రజాకార్ల నిర్బంధం పెరగడంతో ప్రజల నుండి సహాకారం తగ్గుతూ వచ్చింది. దీంతో దళాలు విడిపోయాయి రక్షణ తీసుకోవడమే పెద్ద సమస్యగా మారింది. అదే సమయంలో రంగయ్య ఇంటిని తగులబెట్టారు ఎడ్లను, గేదెలను తోలుకుపోయారు. 1949 నిర్భందం పెరగడంతో రక్షణ రిత్యా భద్రాచలం వైపు వెళ్ళారు. అక్కడ పాత మిత్రుడు తమ్ము కలిసాడు పార్టీ సూచన మేరకు కొద్ది రోజుల అనంతరం తిరిగి మిర్యాలగూడ ప్రాంతానికి అండర్ గ్రౌండ్లో ఉన్నారు. సూర్యాపేట పార్టీ కార్యాలయంలో కొద్దిరోజులు మారుపేరుతో అక్కడ నుండి కొద్దిరోజులు దేవరకొండ కార్యాలయంలో ఉన్నారు. 1952లో చందంపేట పోలీసులు పట్టుకోగా పార్టీ కార్యాలయంలో ఉంటానని చెప్పగా విడిచిపెట్టారు. పార్టీ ఆదేశం మేరకు రహస్యంగా గడిపేందుకు కర్నూలు జిల్లా దుర్వేసీలో నాలుగు నెలల పాటు ఉన్నారు. 1953 ఫిబ్రవరిలో పార్టీ మేరకు బయటకు వచ్చారు.
సుందరయ్య చోరవతో
జానకిరాములు అనే వ్యక్తి మిర్యాలగూడ పార్టీలో పనిచేస్తుండేవాడు. అయితే అతను నాయుకుల సమాచారం రహస్యంగా పోలీసులకు చేరవేసేవాడు. ఈ విషయం పార్టీకి తెలవదు. ఆ ప్రకారంగా సీతారాంరెడ్డిని కాల్వపల్లి వద్ద, రంగయ్యను రాయినిపాలెం వద్ద పోలీసులకు పట్టించాడు. ముందు నల్లగొండ జైలుకు తీసుకెళ్ళారు. ఒక కేసులో నాకు 20 ఏండ్లు జైలు శిక్ష విధించారు. హైకోర్టులో ఉన్న ఆ శిక్షను పది ఏండ్లకు కుదించారు. చంచల్ గూడా జైలుకు తరలించారు. 1953 నుండి నవంబర్ వరకు జైలుజీవితం గడిపారు. సుందరయ్య చోరవతో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా ఆరు సంవత్సరాలు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుదల చేశారు అందులో రంగయ్య ఒకరు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కొనసాగి చీలిక సమయంలో సీపీఐ(ఎం) వైపు నిలిచారు. మొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1987లో మిర్యాలగూడ ఎంపిపిగా గెలుపొందారు. పార్టీలో వివిధ కమిటీల్లో పనిచేశారు.
- Advertisement -