– కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికుల ధర్నాలు, ర్యాలీలు
– కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
– నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లాల్ దర్వాజా మోడ్ చౌరస్తా దగ్గర జీహెచ్‌ఎంసీ ఆటో భవన నిర్మాణ కార్మికులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. సీఐటీయూ చాంద్రాయణగుట్ట జోన్ కమిటీ ఆధ్వర్యంలో బండ్లగూడ ఎంఆర్‌ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. గౌలిగూడ చమాన్ లేబర్ అడ్డా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ గోషామహల్ జోన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. సంతోష్ నగర్ వద్ద మున్సిపల్ కార్మికుల ధర్నా నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షాపూర్‌నగర్ రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బాచుపల్లి పారిశ్రామిక వాడలో, బొల్లారం చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని వైట్ టర్బో పరిశ్రమ ఎదుట కార్మికులు నిరసన తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఎదుట కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్, మావల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేట్టారు. నిర్మల్ పట్టణంలో ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. శ్రీరాంపూర్‌లో నాలుగు లేబర్ కోడ్‌ల ప్రతులను కాల్చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సీఐటీయూతోపాటు ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజేంద్రనగర్‌లో బైక్ ర్యాలీని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ జెండా ఊపి ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కర్ యార్డ్ నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి.. కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, రాజీవ్ చౌక్‌లో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జయలకిë పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ నిరసన కార్యక్రమం చేపట్టాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. మరికల్‌లో ఆశా వర్కర్లు ర్యాలీ తీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో వలస కార్మికులు, మార్కెట్ అమాలీలు బైక్ ర్యాలీ, సుభాష్ విగ్రహం దగ్గర పలు రంగాల కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నాంపల్లి, చండూరు, మిర్యాలగూడ, దేవరకొండ, కట్టంగూర్, నాంపల్లి మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు వద్ద నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ర్యాలీ తీశారు. భువనగిరిలో కొత్త బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఖమ్మం పాత ధర్నాచౌక్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో నిరసన చేపట్టారు. భద్రాచలంలో సీఐటీయూ, ఇల్లందులో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చర్ల మండలంలో సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకులు మానవహారం చేపట్టారు.
కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలపై కన్నెర్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES