నవతెలంగాణ – కాటారం:-
మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో బహుజన రాజ్యాధికార కాంక్షలకు ప్రాణం పోసిన మహనీయుడు కాన్సిరాం జయంతి వేడుకలను కాటారం బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కాన్సిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాటారం సర్పంచ్ పంతకాని సడువలి మాట్లాడుతూ… 1992 సంవత్సరంలో కాన్సిరాం గారితో కలిసి వేదికను పంచుకోవడం తన జీవితంలో గొప్ప అదృష్టమని తెలిపారు. ఆయన స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు నౌళ్ళ సంపత్ మహారాజు మాట్లాడుతూ…“పాలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ” అనే సిద్ధాంతాన్ని జీవితంలో ఆచరణలో చూపించి బడుగు బలహీన వర్గాలకు అధికార మార్గాన్ని చూపిన మహనీయుడు కాన్సిరాం అని కొనియాడారు. సమానత్వ సమాజం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
బారాసా అధికార ప్రతినిధి జక్కు శ్రావణ్ మాట్లాడుతూ… మహానీయుల చరిత్రను ఎవరూ దాచలేరని, అరచేతితో సూర్యకాంతిని అడ్డుకోలేనట్లే మహనీయుల ఆశయాలు ప్రజల్లోకి చేరుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు బోడరాజు బొబ్బిలి వెంకన్న, సంజీవని సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొట్టే సతీష్, ఎంఆర్‌పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు డాక్టర్ రఫీ, బీఎస్పీ సీనియర్ నాయకులు బొడ్డు రాజబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండం మల్లారెడ్డి, బహుజన యువ నాయకులు గోనె మహేష్, జాడీ శేఖర్, శ్రీరాములు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కూడలిలో ఘనంగా కాన్సిరాం జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



